- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాంగ్ కాంగ్ ఓపెన్ సెమీస్‌లో సాత్విక్-చిరాగ్
హాంగ్ కాంగ్ ఓపెన్ సెమీస్‌లోకి సాత్విక్-చిరాగ్ జోడీ అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో మలేసియాకు చెందిన జునైద్-రాయ్‌పై సూపర్ విక్టరీ సాధించింది.

దిశ, స్పోర్ట్స్: హాంగ్ కాంగ్ ఓపెన్‌లో భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. మలేసియాకు చెందిన జునైద్ ఆరిఫ్, రాయ్ కింగ్ యాప్‌తో జరిగిన మ్యాచులో అద్భుతమైన విజయంతో సెమీస్‌కు దూసుకెళ్లారు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 21-14, 20-22, 21-16 తేడాతో సాత్విక్, చిరాగ్ జోడీ నెగ్గింది. మొత్తం 64 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో చిరాగ్ కొంత తడబడినా.. సాత్విక్ మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మొదటి గేమ్‌ను కంప్లీట్‌గా డామినేట్ చేసిన ఈ జోడీ.. రెండో గేమ్‌లో కొంచెం తడబడింది. అయితే చివరి గేమ్‌లో మరోసారి అదరగొట్టి మ్యాచ్‌ను తన ఖాతాలోవేసుకుంది. గత ఏడాది కాలంగా తడబడుతూ ఉన్న సాత్విక్, చిరాగ్ జోడీ.. ఎట్టకేలకు తమ ఫామ్ అందుకున్నట్లే కనిపిస్తున్నారు. ఇదే జోరు కొనసాగించి హాంగ్ కాంగ్ ఓపెన్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.
లక్ష్యసేన్ కూడా..
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కూడా హాంగ్ కాంగ్ సెమీస్ చేరుకున్నాడు. మరో భారతీయుడు ఆయుష్ శెట్టితో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ గెలుపొందాడు. 66 నిమిషాలపాటు అద్భుతంగా సాగిన ఈ మ్యాచ్‌లో 16-21, 21-17, 13-21 తేడాతో లక్ష్యసేన్ విజయం సాధించాడు.






