చైనా మాస్టర్స్ సెమీస్‌కు సాత్విక్-చిరాగ్.. సింధూ అవుట్

by Phanindra |

చైనా మాస్టర్స్ సెమీస్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ దూసుకెళ్లింది. అదే సమయంలో స్టార్ షట్లర్ సింధూ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

చైనా మాస్టర్స్ సెమీస్‌కు సాత్విక్-చిరాగ్.. సింధూ అవుట్
X

దిశ, స్పోర్ట్స్: భారత పురుషుల టాప్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి అద్భుతమైన ఆటతో చైనా మాస్టర్స్ సూపర్ 750 సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. చైనాకు చెందిన రెన్ జియాంగ్ యూ, జీ హోనన్ జోడీపై 21-14, 21-14 తేడాతో సాత్విక్, చిరాగ్ జోడీ అద్భుతమైన విజయం సాధించింది. సెమీస్‌లో మలేసియాకు చెందిన ఆరన్ చియా, సో వూ యిక్‌తో సాత్విక్-చిరాగ్ తలపడనున్నారు.

అయితే మహిళల సింగిల్స్‌లో స్టార్ ప్లేయర్ పీవీ సింధూ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒలింపిక్ ఛాంపియన్ ఆన్ సె యంగ్ చేతిలో ఓడిన సింధూ.. ఇంటిదారిపట్టింది. సింధూ 14-21, 13-21 తేడాతో ఓటమిపాలైంది. సె యంగ్ చేతిలో ఇది సింధూకు వరుసగా 8వ ఓటమి కావడం గమనార్హం.

Next Story