తిలక్‌కు రిప్లేస్‌మెంట్‌గా గిల్, జైశ్వాల్ కాదు.. శ్రేయస్ అయ్యర్ సరైనోడు : భారత మాజీ క్రికెటర్

by Harish |

తిలక్‌కు రిప్లేస్‌మెంట్‌గా గిల్, జైశ్వాల్ కాదు.. శ్రేయస్ అయ్యర్ సరైనోడు : భారత మాజీ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : సర్జరీ కారణంగా బ్యాటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. బీసీసీఐ ఇంకా అతనికి రిప్లేస్‌‌మెంట్ ప్రకటించలేదు. జట్టులో చోటు కోసం గిల్, శ్రేయస్ అయ్యర్, జైశ్వాల్, యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. మిడిలార్డర్‌లో స్థిరత్వం, అనుభవం కావాలి కాబట్టి శ్రేయస్ అయ్యర్ సరైన ఎంపిక అని చెప్పాడు. ‘ఇంకెవరు శ్రేయస్ అయ్యరే. సర్పంచ్ సాబ్ ఆటోమేటిక్‌గా ఎంపికవుతాడు. విజయ్ హజారే ట్రోఫీలో బాగా ఆడాడు. ఆసియా కప్‌కే అతన్ని ఎంపిక చేయకపోవడం వల్ల అన్యాయం జరిగింది. కానీ అది అర్థం చేసుకోదగ్గది. ఇప్పుడు మిడిలార్డర్‌లో అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్‌కే నా ఓటు.’అని తెలిపాడు. అలాగే, టీమిండియాకు అదనంగా ఓపెనర్ అవసరం లేదన్నాడు. కాబట్టి రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్‌లను ఎంపిక చేసే అవకాశాలు లేవన్నాడు. టీమ్ మేనేజ్‌మెంట్ ఒకవేళ ఆల్‌రౌండర్ కోసం చూస్తుంటే రియాన్ పరాగ్‌ ఎంపిక కావొచ్చని అభిప్రాయపడ్డాడు. అతను గతంలో టీ20 జట్టుకు ఆడాడని, బౌలింగ్ కూడా చేయగలడని చెప్పాడు. అయితే, తన ఓటు అయ్యర్‌కేనని, పరాగ్‌కు రెండో స్థానం ఇస్తానని అన్నాడు.


Next Story