ఫిట్నెస్ రంగంలోకి సచిన్ కూతురు సారా

by Muthe.Rajitha |

భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫిట్నెస్ రంగంలోకి అడుగుపెట్టారు.

ఫిట్నెస్ రంగంలోకి సచిన్ కూతురు సారా
X

దిశ, వెబ్ డెస్క్ : భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఫిట్నెస్ రంగంలోకి అడుగుపెట్టారు. సారా ఇటీవల పిలాటిస్ అకాడమీని ముంబైలోని అంధేరిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సచిన్ తన X ఖాతాలో పోస్టు చేయగా.. అభిమానులు భారీగా లైకులు, షేర్లు చేస్తున్నారు. అలాగే సారాపై అభినందనలు కురిపిస్తున్నారు. "సారా పిలాటిస్ అకాడమీ తెరిచింది. దానిని చూసి మా మనసు ఆనందంతో ఉప్పొంగి పోయింది. తన స్వశక్తితో, తెలివితో ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఇంత దూరం చేరుకుంది.

పోషకాహారం, ఫిట్నెస్ ఎల్లపుడూ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తనకు ఇష్టమైన ఫిట్నెస్ రంగంలో తన ప్రస్థానం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది. నీకు అభినందనలు సారా.." అంటూ ట్వీట్ చేసారు సచిన్. అయితే ఇంతకముందు మోడలింగ్ రంగంలో ఉన్న సారా ఇటీవలే దుబాయ్ కి చెందిన మరోసంస్థ పార్ట్నర్షిప్ తో ఫిట్నెస్ రంగంలోకి ప్రవేశించింది. అలాగే సారా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ కూడా కావడంతో ఈ రంగాన్ని ఎంచుకోవడం మరో కారణం. అయితే ఈ కార్యక్రమంలో సారా కుటుంబ సభ్యులతోపాటు సారా అన్నయ్య అర్జున్ కు కాబోయే భార్య కూడా పాల్గొని సందడి చేయడం మరో విశేషం.

Next Story