గాల్లోకి బ్యాట్ విసిరిన సంజూ.. ఇంత ఓవరాక్షన్ అవసరమా ?

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (ipl 2025) భాగంగా... శనివారం రోజున రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals )

గాల్లోకి బ్యాట్ విసిరిన సంజూ.. ఇంత ఓవరాక్షన్ అవసరమా ?
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో (ipl 2025) భాగంగా... శనివారం రోజున రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో... రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ( Sanju Samson ) ప్రస్టేషన్‌ కు గురయ్యాడు. తన వికెట్ కోల్పోవడంతో.... సహనం కోల్పోయిన సంజు శాంసన్ ( Sanju Samson )... గాల్లోకి తన బ్యాట్ విసిరేసాడు. శనివారం సాయంత్రం ఏడున్నర గంటలకు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఇక నిర్ణీత 20 ఓవర్లలో... 20 ఓవర్లు ఆడిన రాజస్థాన్ రాయల్స్... నాలుగు వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేసింది. అయితే రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో.. కెప్టెన్ సంజు శాంసన్ ( Sanju Samson ) ప్రస్టేషన్‌ కు గురయ్యాడు. 26 బంతులు ఆడిన సంజు శాంసన్ 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. పెర్గు సన్ ( Lockie Ferguson ) వేసిన అద్భుతమైన బంతికి... టెంప్ట్ అయిన సంజు శాంసన్.... శ్రేయస్ అయ్యర్ కు ( Shreyas Iyer) క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక తన వికెట్ కోల్పోయిన తర్వాత ప్రస్టేషన్‌ కు గురైన.. సంజు శాంసన్ తన బ్యాట్ గాల్లోకి విసిరేశాడు. ఈ తరుణంలో గాల్లో ఆ బ్యాట్ గిరాగిరా తిరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఆలా బ్యాట్ విసరడంపై నెటిజెన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

Next Story