- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Virat Kohli : కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై సంజయ్ మంజ్రేకర్ విమర్శలు
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ను పూర్తిగా తప్పు పట్టారు సంజయ్ మంజ్రేకర్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు.

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ను పూర్తిగా తప్పు పట్టారు సంజయ్ మంజ్రేకర్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు రూట్ టెస్ట్ క్రికెట్ లో అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడారు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం అలాంటి అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడని ఫైరయ్యారు. ఆడే సత్తా ఉన్నా రిటైర్మెంట్ ప్రకటించాడని మండిపడ్డారు. సరిగ్గా ఏడాది కిందట అందరికన్నా టాప్ లో టెస్ట్ క్రికెటర్ గా విరాట్ కోహ్లీ ఉండేవాడని గుర్తు చేశారు.
వన్డేలు ఆడటం దండగే..మంజ్రేకర్ సీరియస్
కానీ ఎంతో ప్రతిష్టాత్మకమైన టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడంతో, అతని స్థానాన్ని రూట్ భర్తీ చేస్తున్నట్లు వెల్లడించారు. నిజంగా టెస్ట్ క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఇవ్వడం దిగ్భ్రాంతిని వ్యక్తం చేయాల్సిన విషయం అంటూ ఎమోషనల్ అయ్యారు. గడిచిన ఐదు సంవత్సరాలలో సగటు 31తో బాధపడిన విరాట్ కోహ్లీ... ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి పోరాటం మాత్రం చేయలేకపోయాడని ఫైర్ అయ్యారు. అలాంటి విరాట్ కోహ్లీ, మూడు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ఉంటే బాగుండేదని చురకలు అంటించారు. అలా చేయకుండా సులభమైన వన్డేలు ఆడడం దారుణం అంటూ ఫైర్ అయ్యారు. చాలా ఫిట్ గా ఉన్న విరాట్ కోహ్లీ టెస్టులు ఆడితే బాగుండేదని వెల్లడించారు. కాగా టెస్టులు, టీ20లకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ వన్డేల్లో ఆడుతున్నాడు.






