ఐపీఎల్‌కు దూరమైన మరో స్టార్ ప్లేయర్.. ఆ జట్టుకు భారీ షాక్

by Malleboina Mahesh |   (  Updated:2025-05-01 15:27:59  IST  )

ఐపీఎల్ 2025ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా పలువురు ప్లేయర్లు పలు మ్యాచులకు దూరం కాగా మరికొందరు సీజన్ మొత్తానికి దూరం అయ్యారు.

ఐపీఎల్‌కు దూరమైన మరో స్టార్ ప్లేయర్.. ఆ జట్టుకు భారీ షాక్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే గాయాల కారణంగా పలువురు ప్లేయర్లు పలు మ్యాచులకు దూరం కాగా మరికొందరు ఐపీఎల్ (IPL) 2025 సీజన్ మొత్తానికి దూరం అయ్యారు. తాజాగా ఈ జాబితాలో మరో ముగ్గురు ప్లేయార్లు చేరారు. ముంబైకి చెందిన విఘ్నేష్, పంజాబ్ ఆల్ రౌండర్ మాక్స్‌వెల్ పూర్తి సీజన్ కు దూరం అయ్యారు. ఈ వార్తల నుంచి తేరుకొక ముందో మరో స్టార్ బౌలర్ గాయం కారణంగా మిగిలిన సీజన్ మొత్తానికి దూరం అయ్యాడనే వార్తలు వచ్చాయి. ఈ సీజన్‌లో అనుకున్నంత రాణించలేకపోయిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు చివరి మ్యాచులో భారీ విజయంతో సంచలనం సృష్టించింది. ఈ ఆనందం వారికి కొద్ది గంటలు కూడా మిగల్లేదు. అదే మ్యాచులో ఫిల్టింగ్ చేస్తున్న సమయంలో స్టార్ బౌలర్ అయిన సందీప్ శర్మ (Sandeep Sharma) చేతికి గాయం అయింది.

అయితే మెడికల్ చెకప్ అనంతరం సందీప్ శర్మ గాయం తీవ్రత అధికంగా ఉందని తేల్చిన డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్న సందీప్ శర్మ మిగిలిఉన్న ఈ సీజన్ మొత్తానికి దూరం అయినట్లు RR యాజమాన్యం ప్రకటించింది. ఈ సీజన్‌లో 10 మ్యాచుల్లో మంచి బౌలింగ్ వేసిన సందీప్ శర్మ 9 వికెట్లను తీసుకున్నాడు. అయితే ఈ సీజన్ లో అతడు చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ గెలిచిన మ్యాచుల్లో అతడే కీలక పాత్ర పోషించడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కాగా ఈ రోజు ముంబైతో జరిగిన మ్యాచులో సందీప్ శర్మ లేని లోటు జట్టులో కొట్టొచ్చినట్లు కనబడింది. నేటి మ్యాచులో సందీప్ స్థానంలో Akash Madhwalను జట్టులోకి తీసుకున్నారు.

Next Story