- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు ఓవర్లు చాలు...మ్యాచ్ తలకిందులు చేస్తాం..టీమిండియాకు పాకిస్తాన్ కెప్టెన్ వార్నింగ్ !
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025) నేపథ్యంలో టీమిండియాకు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha

దిశ, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025) నేపథ్యంలో టీమిండియాకు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా (Salman Ali Agha ) డేంజర్ బెల్స్ పంపిస్తున్నారు. 3 - 4 ఓవర్లలో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాం... ఆ సత్తా పాకిస్థాన్ లో ఉందని... కచ్చితంగా టీమిండియాను ఓడిస్తామని పరోక్షంగా పేర్కొన్నారు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న తరుణంలో...8 జట్ల కెప్టెన్లు అందరూ ఫోటో షూట్ లో పాల్గొన్నారు. అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడారు. టీ20 ఫార్మెట్ లో మ్యాచ్ లు ఉంటాయి కనుక... ఏ క్షణమైనా మ్యాచ్ స్వరూపం మారిపోతుందన్నారు. ఓడిపోయే జట్టు.. 3-4 ఓవర్లు బాగా ఆడితే కచ్చితంగా గెలుస్తుందన్నారు.
అదే స్ట్రాటజీతో తాము ముందుకు వెళతామని వెల్లడించారు. ఆసియా కప్ లో తమ జట్టు...గట్టి ఇస్తుందని.. అన్ని జట్లను ఓడిస్తామన్నారు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా. దీంతో సల్మాన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా.. టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ 14వ తేదీన జరుగనుంది.






