పాకిస్తాన్ జ‌ట్టులో ముస‌లం..కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

by velandi.Saikiran |

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో పాకిస్తాన్ విజయం కోసం ఎంతకైనా ముందుకు వెళ్తామని కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha) కీల‌క‌ ప్రకటన చేశారు.

పాకిస్తాన్ జ‌ట్టులో ముస‌లం..కెప్టెన్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. రేపటి నుంచే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో పాల్గొనే జట్లన్నీ సిద్ధమయ్యాయి. అన్ని తమ తమ వేదికలకు వెళ్లిపోయాయి. రేపు సరిగ్గా ఉదయం 11 గంటలకు టోర్నమెంట్ కూడా షురూ అవుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టులో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha) సంచలన ప్రకటన చేశారు. టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ గెలిచేందుకు ఎవరు ఊహించని నిర్ణయాలు తీసుకోవడం చూస్తారని ప్లేయర్లకు హెచ్చరికలు జారీ చేశారు. కీలక ప్లేయర్లను కూడా పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయన్నారు.

బాబర్ ఆజం లాంటి వాళ్లను కూడా పక్కకు తోసేయడమే

టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటులో పాకిస్తాన్ విజయం కోసం ఎంతకైనా ముందుకు వెళ్తామని కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha) కీల‌క‌ ప్రకటన చేశారు. పాకిస్తాన్ జట్టుకు అవసరమైన ప్లేయర్లను మాత్రమే తుది జట్టులో ఆడిస్తామన్నారు. ఒక్క‌ మ్యాచ్ లోనే విఫలమైతే తీసేయడమేన‌ని, అంద‌రూ క‌చ్చితంగా బాగా ఆడాలంటూ హెచ్చరించారు. ఫఖ‌ర్ జమాన్, బాబర్ ఆజం లాంటి సీనియర్ క్రికెటర్లను కూడా పక్కకు పెట్టే అవకాశం ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కేవలం జట్టుకు ఉపయోగపడే ప్లేయ‌ర్ల‌ను మాత్రమే కొనసాగిస్తామన్నారు. ఈ టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ లోనే ఫెయిల్ అయితే తొలగించడం ఖాయం అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా సీనియర్ క్రికెటర్లు కూడా ఆడి, జట్టును బ్యాలెన్స్ చేయాలని కోరారు.

ప్లేయర్ల కంటే పాకిస్తాన్ విజయమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ( Salman Ali Agha). ఇది ఇలా ఉండగా రేపటి నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి మ్యాచ్ కోసం పాకిస్తాన్ సిద్ధమైంది. రేపు నెద‌ర్లాండ్స్, పాకిస్తాన్ మధ్య ఉదయం 11 గంటలకు కొలంబో వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ లు జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ లో ప్రసారమవుతాయి. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంటు నేప‌థ్యంలో ఇండియా, పాక్ మ్యాచ్ జ‌రుగ‌డంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్ప‌టికే ఫిబ్ర‌వ‌రి 15వ తేదీన జ‌రిగే ఇండియా, పాక్ మ్యాచ్ ను బ‌హిష్కరించిన‌ట్లు ఆ దేశ ప్ర‌ధాని ష‌రీఫ్ (Pakistan Pm Sharif ) వెల్ల‌డించారు. కానీ, నేష‌న‌ల్ మీడియాతో క‌థ‌నాల ప్ర‌కారం మాత్రం, ఇండియా, పాక్ మ‌ధ్య మ్యాచ్ ( Ind VS Pak ) జ‌రుగుతుంద‌ని అంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగి వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ట‌.


Next Story