బుమ్రా బౌలింగ్ లో ఫర్హాన్ అరాచకం...3 సిక్స‌ర్లు, 7 బౌండ‌రీలు, భారీ స్కోర్ దిశ‌గా పాక్‌

by velandi.Saikiran |

బుమ్రాను టార్గెట్ చేశాడు సాహిబ్జాదా ఫర్హాన్. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సాహిబ్జాదా ఫర్హాన్.. 57 ప‌రుగులు చేసాడు.

బుమ్రా బౌలింగ్ లో ఫర్హాన్ అరాచకం...3 సిక్స‌ర్లు, 7 బౌండ‌రీలు, భారీ స్కోర్ దిశ‌గా పాక్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఆసియా క‌ప్ 2025 ఫైన‌ల్స్ లో టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మ్యాచ్ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న పాకిస్థాన్... భారీ స్కోర్ దిశ‌గా దూసుకువెళుతోంది. ఇప్ప‌టికే 100కు పైగా ప‌రుగులు చేసిన పాక్ 2 వికెట్లు మాత్ర‌మే న‌ష్ట‌పోయింది. ప్ర‌స్తుతం 13 ఓవ‌ర్లు ఆడిన పాక్ 113 ప‌రుగులు చేసింది. పాక్ ఊపు చూస్తుంటే.. 200 దాటించేలా క‌నిపిస్తున్నారు.

కాగా.. ఈ మ్యాచ్ లో బుమ్రాను టార్గెట్ చేశాడు పాక్ ఓపెన‌ర్ సాహిబ్జాదా ఫర్హాన్. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన సాహిబ్జాదా ఫర్హాన్.. 57 ప‌రుగులు చేసాడు. అలాగే బుమ్రా బౌలింగ్ లో సిక్స‌ర్ తో పాటు బౌండరీలు కొట్టాడు. దీంతో ఆసియా క‌ప్ 2025 లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం బుమ్రా బౌలింగ్ లోనే 3 సిక్స‌ర్ల‌తో పాటు 7 బౌండ‌రీలు కొట్టాడు ఫర్హాన్. దీంతో అత‌ని బౌలింగ్ లో అద్భుతంగా రాణించిన ప్లేయ‌ర్ గా రికార్డు సృష్టించాడు.

Next Story