SAFF U17 : ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్‌లో నేపాల్‌పై సూపర్ విక్టరీ

by Harish |

శాఫ్ అండర్-17 చాంపియన్‌షిప్ టోర్నీలో భారత అండర్-17 పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది.

SAFF U17 : ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్.. సెమీస్‌లో నేపాల్‌పై సూపర్ విక్టరీ
X

దిశ, స్పోర్ట్స్ : శాఫ్ అండర్-17 చాంపియన్‌షిప్ టోర్నీలో భారత అండర్-17 పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన సెమీస్‌లో భారత్ 3-0 తేడాతో నేపాల్‌పై విజయం సాధించింది. ఆరంభంలో కాస్త తడబడిన భారత్.. నేపాల్ డిఫెన్స్‌ను బద్దలుకొట్టడానికి కష్టపడింది. కానీ, సెకండాఫ్‌లో బలంగా పుంజుకుంది. 60వ నిమిషంలో గన్‌లీబా వాంగ్‌ఖైరక్‌పామ్, 70వ నిమిషంలో అజ్లాన్ షా ఖ్, 94వ నిమిషంలో డైమండ్ సింగ్ థోక్‌చోమ్‌లు గోల్స్ చేశారు. మరోవైపు, నేపాల్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. మరో సెమీస్‌లో పాకిస్తాన్‌ను 0-2తో బంగ్లాదేశ్ చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. శనివారం భారత్, బంగ్లా మధ్య టైటిల్ పోరు జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ టైటిల్ నిలబెట్టుకోవాలని చూస్తోంది. గతేడాది కూడా ఫైనల్‌లో బంగ్లాదేశ్‌నే ఓడించింది.


Next Story