కెప్టెన్సీ నిరాకరించడంతోనే కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడా?.. రవిశాస్త్రి వ్యాఖ్యల అర్థం అదేనా?

by Harish |   (  Updated:2025-06-12 05:54:56  IST  )

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే.

కెప్టెన్సీ నిరాకరించడంతోనే కోహ్లీ రిటైర్మెంట్ ఇచ్చాడా?.. రవిశాస్త్రి వ్యాఖ్యల అర్థం అదేనా?
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చిన విషయం తెలిసిందే. కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికి నెల రోజులు గడుస్తున్నా క్రికెట్ వర్గాల్లో ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ టూరుకు ముందు కోహ్లీని టెస్టు కెప్టెన్‌గా నియమిస్తే బాగుండేదన్నాడు. అతనితో బీసీసీఐ పెద్దలు మరింత మెరుగ్గా చర్చించాల్సి ఉండేదన్నాడు. ‘కోహ్లీ రిటైర్‌ అయిన తర్వాత అందరికీ అతను ఎంతో పెద్ద ఆటగాడో తెలిసింది. అతను వెళ్లిపోయినందుకు, వెళ్లిపోయిన తీరు నన్ను బాధించింది. కోహ్లీ విషయాన్ని మరింత మెరుగ్గా హ్యాండిల్ చేయాల్సింది. అతనితో మరింత చర్చించాల్సింది. నేనైతే ఆస్ట్రేలియా పర్యటన తర్వాత కోహ్లీనే నేరుగా కెప్టెన్ చేసేవాడిని.’అని అని శాస్త్రి వ్యాఖ్యానించాడు. కోహ్లీ తిరిగి కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడని భావించాడని, ఈ విషయాన్ని సెలెక్టర్లకు తెలియజేయగా వారు నిరాకరించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో విరాట్ రిటైర్మెంట్ ప్రకటించినట్టు ప్రచారం జరిగింది. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలు ఆ వార్తలకు ఊతమిచ్చేలా ఉన్నాయి.


Next Story