గ్రౌండ్ లో రిషబ్ పంత్ కుప్పిగంతులు... వార్నింగ్ ఇచ్చిన సచిన్!

by velandi.Saikiran |   (  Updated:2025-06-21 14:23:12  IST  )

ఇండియా (INDIA) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య మొదటి టెస్ట్ నేపథ్యంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ( Rishabh pant) అద్భుతమై

గ్రౌండ్ లో రిషబ్ పంత్ కుప్పిగంతులు... వార్నింగ్ ఇచ్చిన సచిన్!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా (INDIA) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య మొదటి టెస్ట్ నేపథ్యంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ( Rishabh pant) అద్భుతమైన సెంచరీ తో రాణించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్లో ( IPL 2025) అట్టర్ ఫ్లాప్ అయిన రిషబ్ పంత్ ను టెస్ట్ సిరీస్ కు సెలెక్ట్ చేసిన బీసీసీఐ (BCCI) నమ్మకాన్ని... పంత్ నిలబెట్టాడు. ఇంగ్లాండ్ జట్టుపై మొదటి మ్యాచ్ లోనే సెంచరీ చేసి దుమ్ము లేపాడు పంత్. 178 బంతులు ఆడిన రిషబ్ పంత్ 134 పరుగులు చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. ఇందులో ఆరు సిక్సర్లు అలాగే 12 బౌండరీలు ఉన్నాయి.

ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత... కుప్పిగంతులు వేస్తూ గ్రౌండ్ లో రచ్చ చేశాడు రిషబ్ పంత్. సర్కస్ లో చేసినట్లుగానే గాల్లో ఎగురుతూ జంపింగ్ చేశాడు. మొన్న గుజరాత్ టైటాన్స్ పైన కూడా అచ్చం ఇలాగే సెంచరీ చేసి రెచ్చిపోయాడు రిషబ్ పంత్. అయితే రిషబ్ పంత్ సెలబ్రేషన్స్ పైన... తాజాగా లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు.

రిషబ్ పంత్ చాలా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడని.. ఈ సందర్భంగా కొనియాడాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar). సెంచరీ పూర్తయిన తర్వాత అతడు సెలబ్రేషన్స్ కూడా అద్భుతంగా చేసుకున్నాడని... వెల్లడించారు. అయితే ఆ దూకుడు కాస్త తగ్గించాలని... అప్పుడే మంచి బ్యాటర్ అవుతాడని కూడా పరోక్షంగా చురకలు అంటించాడు సచిన్ టెండుల్కర్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇది ఇలా ఉండగా ఈ మొదటి మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 471 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.

Next Story