సచిన్‌‌కు మరో అరుదైన గౌరవం.. బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్

by Disha Web Desk 13 |
సచిన్‌‌కు మరో అరుదైన గౌరవం.. బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమ్‌ఇండియా క్రికెట్‌ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సచిన్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్. సిడ్ని క్రికెట్ స్టేడియంలో ఒక గేట్‌కు అతడి పేరు పెట్టారు. మరో గేటుకు వెస్టిండీస్‌ లెజెండ్‌ బ్రియన్‌ లారా పేరు పెట్టాయి. దాంతో వీరిద్దరూ డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌, అలన్‌ డేవిడ్‌సన్‌, ఆర్థర్‌ మోరిస్‌ సరసన నిలిచారు. సచిన్‌తో పాటు లారాకు కూడా ఇక్కడ మధురమైన జ్ఞాపకాలున్నాయి.

లారా తన టెస్టు కెరీర్‌ను ఆరంభించింది ఇక్కడే. 1993లో లారా.. సిడ్నీ టెస్టులో ఎంట్రీ ఇచ్చి 277 పరుగులతో సంచలనం సృష్టించాడు. దీనికి 30 ఏండ్లు నిండటంతో.. సచిన్, లారాలను ఒకేరోజున గౌరవించింది ఎస్‌సీజీ. కాగా సిడ్నీలో లారా 4 టెస్టులు ఆడగా.. 384 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 277. ఈ గ్రౌండ్‌లో ఇదే హయ్యస్ట్ స్కోరు. సచిన్ సిడ్నీలో 5 టెస్ట్‌లు ఆడగా 788 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండటం విశేషం. సిడ్నీలో సచిన్ సగటు ఏకంగా 157 గా ఉంది.

Next Story