క్రికెట్‌కు చీకటి రోజు.. చిన్నస్వామి తొక్కిసలాటపై సచిన్, కుంబ్లే రియాక్షన్!

by Phanindra |

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సచిన్, కుంబ్లే సహా పలువురు క్రికెటర్లు రియాక్టయ్యారు.

క్రికెట్‌కు చీకటి రోజు.. చిన్నస్వామి తొక్కిసలాటపై సచిన్, కుంబ్లే రియాక్షన్!
X

దిశ, స్పోర్ట్స్: చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ విషాదంగా ముగిశాయి. స్టేడియం బయట లక్షల మంది ఫ్యాన్స్ గుమిగూడటంతో పరిస్థితి చేయిదాటింది. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో 11 మంది ఫ్యాన్స్ ప్రాణాలు కోల్పోగా.. 30 మందికిపైగా గాయపడినట్లు సమచారం. ఈ దుర్ఘటనపై విరాట్ కోహ్లీ, సచిన్, కుంబ్లే, ధవన్, హర్భజన్, దొడ్డ గణేష్, ఇర్ఫాన్ పఠాన్ తదితర స్టార్ క్రికెటర్లు స్పందించారు. మృతులకు, వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ఘోరం చాలా విషాదకరం. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వాళ్లకు శాంతి, శక్తి కలగాలని కోరుకుంటున్నా - సచిన్ టెండూల్కర్

క్రికెట్‌కు దుఃఖభరితమైన రోజు ఇది. ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ మరణించిన వారి నా సానుభూతి. గాయాలైన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. చాలా విషాదకరం! - అనిల్ కుంబ్లే

ఈ దుర్ఘటనపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. ఆర్సీబీ స్టేట్‌మెంట్‌ను షేర్ చేసిన కోహ్లీ.. ‘మాటలు పెగలట్లేదు.. అత్యంత విషాదకరం’ అంటూ కామెంట్ చేశాడు. అనుష్క శర్మ, మరికొందరు ఆర్సీబీ ప్లేయర్లు కూడా ఈ స్టేట్‌మెంట్‌ను షేర్ చేసి, తమ బాధను వ్యక్తం చేశారు.

Next Story