సంజు ఔట్‌...రాజ‌స్తాన్ కు కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు ?

by velandi.Saikiran |

యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ వస్తుందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి

సంజు ఔట్‌...రాజ‌స్తాన్ కు కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రాజస్తాన్ జట్టులో కీలక మార్పులు జరగనున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాజస్తాన్ జట్టుకు సంబంధించిన సంజు శాంస‌న్‌ చెన్నై జట్టులోకి వెళ్లనున్నాడు. ఈ మేర‌కు ఇప్పటికే ట్రేడింగ్ ప్రక్రియ కూడా పూర్తయింది. సంజు స్థానంలో రవీంద్ర జడేజాతో పాటు సామ్ కరణ్ చెన్నై జట్టు నుంచి రాజస్తాన్ లోకి వస్తారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ ఎవరు అనేదానిపైన సందిగ్ధత నెలకొంది.

కచ్చితంగా యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ వస్తుందని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. రియాన్ పరాగ్ లాంటి చెత్త ప్లేయర్ కు కెప్టెన్సీ ఇవ్వకూడదని, గత సీజన్ లో అతడు కెప్టెన్ గా వ్యవహరించినా, ప్రయోజనం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. దీంతో యశస్వి జైస్వాల్ అలాగే ధ్రువ్ జురెల్ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ వస్తుందని అంటున్నారు. ఇక అటు చెన్నైలో సంజు ఫ్యూచర్ కెప్టెన్ గా ఎదిగే ఛాన్స్ ఉంది. కాలం కలిసి వస్తే, వచ్చే సంవత్సరమే కెప్టెన్ అవుతాడని అంటున్నారు.

Next Story