WPL 2026: పాపం ఢిల్లీ..మ‌రోసారి ఛాంపియ‌న్ గా బెంగుళురు

by velandi.Saikiran |   (  Updated:2026-02-05 18:14:03  IST  )

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఛాంపియన్ గా బెంగళూరు నిలిచింది.

WPL 2026: పాపం ఢిల్లీ..మ‌రోసారి ఛాంపియ‌న్ గా బెంగుళురు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఛాంపియన్ గా బెంగళూరు నిలిచింది. ఇప్పటికే 2024 ఛాంపియన్ గా నిలిచిన బెంగళూరు.. ఇప్పుడు ఢిల్లీ మ‌రోసారి ఓడించి, మరోసారి ఛాంపియన్ గా అవతారం ఎత్తింది. ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ పైన గ్రాండ్ విక్టరీ కొట్టింది బెంగళూరు. దీంతో ఢిల్లీ పైన ఆరు వికెట్లతో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, రెండోసారి ఛాంపియన్ అయింది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ, 204 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ముందు ఉంచింది. అయితే ఈ లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో బెంగళూరు ఛేదించి రెండోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఈ సందర్భంగా కేవలం నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. స్మృతి మందాన 87 పరుగులతో రెచ్చిపోగా, జార్జియా వాల్ 79 పరుగులతో రాణించారు. దీంతో బెంగుళూరు బయటపడింది. అటు ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు ప్రతిసారి ఫైనల్ కు వచ్చి ఓడిపోవడం నిరాశకు గురి చేసింది.

రెండోసారి బెంగ‌ళూరుకు టైటిల్...ఢిల్లీకి షాక్‌

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( WPL 2026) ఛాంపియన్ అయింది బెంగళూరు. దీంతో ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు రెండు సార్లు ఛాంపియన్ అయిన జట్టుగా బెంగుళూరు ( Royal Challengers Bengaluru Women) సరికొత్త రికార్డు సృష్టించింది. 2023 సంవత్సరంలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఆ సందర్భంగా ముంబై ఇండియన్స్ మొదటి టైటిల్ గెల్చుకుంది. అప్పుడు ఫైనల్ దాకా వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals Women) మహిళలు జట్టు ఓడిపోవడం చూశాం. ఆ తర్వాత 2024లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ దాకా వచ్చి ఓడిపోయింది.

ఆ సమయంలో బెంగళూరు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించి మొట్టమొదటిగా టైటిల్ గెలుచుకుంది. ఇక చివరి 2025 సీజన్ సందర్భంగా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్ దాకా వచ్చి 8 పరుగుల తేడాతో ముంబై చేతిలో చిత్తుగా ఓడిపోయింది. దీంతో హార్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో రెండోసారి ముంబై ఇండియన్స్ మహిళల జట్టు ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఈ 2026 టోర్నమెంటులో స్మృతి మందాన కెప్టెన్సీలో మరోసారి బెంగళూరు టైటిల్ గెల్చుకోవడం గమనార్హం. ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ రెండు టైటిల్స్ గెల్చుకోగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు రెండుసార్లు కూడా ఛాంపియన్ అయింది.

అటు వరుసగా నాలుగు సార్లు ఫైనల్ దాకా వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోవడం చూశాం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్ లో బెంగళూరు టాస్ గెలిచి మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే ప్లాన్స్ అమలు చేసింది బెంగళూరు. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన స్మృతి మందాన 87 పరుగులు సాధించగా మరో బ్యాటర్ వోల్ 79 పరుగులతో రెచ్చిపోయింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మంచి పార్టనర్ షిప్ వచ్చింది. దీంతో గ్రాండ్ విక్టరీ కొట్టింది బెంగళూరు.

Next Story