- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాస్ టేలర్ రీఎంట్రీ.. ఆ పసికూన జట్టుకు ఆడేందుకు సిద్ధం
న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రాస్ టేలర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్ దిగ్గజ క్రికెటర్ రాస్ టేలర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయాన్ని టేలర్ శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 2022లో అతను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మూడేళ్ల తర్వాత తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్న అతను తిరిగి అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. 41 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. అయితే, టేలర్ పునరాగమనంలో న్యూజిలాండ్‌కు ఆడటం లేదు. సమోవా జట్టు తరపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడబోతున్నాడు. ‘రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా. సమోవా తరపున ఆడబోతున్నానని గర్వంగా ప్రకటిస్తున్నా. ఇది కేవలం పునరాగమనం మాత్రమే కాదు. నా వారసత్వం, సంస్కృతి, గ్రామాలు, కుటుంబాలకు మరోసారి ప్రాతినిధ్యం వహించడం. తిరిగి క్రికెట్ ఆడబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.’అని టేలర్ తెలిపాడు.
సమోవా మూలాలు ఉన్న తన తల్లి వారసత్వంగా కారణంగా అతను సమోవా తరపున ఆడేందుకు అర్హత పొందాడు. అలాగే, న్యూజిలాండ్ తరపున చివరి మ్యాచ్ ఆడి మూడేళ్లు పూర్తవడంతో టేలర్ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో జట్టు తరపున ఆడొచ్చు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆసియా-ఈస్ట్ ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్‌లో టేలర్ సమోవాకు ఆడబోతున్నాడు. సమోవా ప్రకటించిన జట్టులో టేలర్‌కు చోటు దక్కింది. కాగా, కివీస్ తరపున అతను 112 టెస్టుల, 236 వన్డేలు, 102 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 18,195 రన్స్ చేశాడు. కివీస్ తరపున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు టేలర్ పేరిటే ఉంది.






