- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mother's Day: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పెషల్ పోస్ట్
అంతర్జాతీయ మాతృదినోత్సవం(International Mother's Day) సందర్భంగా ఆదివారం (మే11) అందరూ తమ తల్లులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ మాతృదినోత్సవం(International Mother's Day) సందర్భంగా ఆదివారం (మే11) అందరూ తమ తల్లులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి తల్లితో వారికున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఇక తల్లులు కూడా తమ పిల్లలతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు. కొందరు గిఫ్టులు, శారీలతో సర్‌ప్రైజ్ చేస్తుండగా, మరికొందరు ఈ ఒక్కరోజు తల్లితో గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక మదర్స్ డే సందర్భంగా టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఆయన తల్లితో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. గమనించిన హిట్‌మ్యాన్స్.. ఆ పోస్టును తెగ వైరల్ చేస్తున్నారు.
మరోవైపు అనూహ్యంగా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు ముగింపు పలికాడు. రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశాడు. ఈ ఐపీఎల్ కంటే ముందు గతేడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టులు చివరగా రోహిత్ శర్మ ఆడారు. 2024లో తన కెప్టెన్సీలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోహ్లీతో పాటే రోహిత్ కూడా పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.






