మరోసారి అదరగొట్టిన రోహిత్ శర్మ.. అరుదైన రికార్డు నమోదు

by Gantepaka Srikanth |

మరోసారి అదరగొట్టిన రోహిత్ శర్మ.. అరుదైన రికార్డు నమోదు

మరోసారి అదరగొట్టిన రోహిత్ శర్మ.. అరుదైన రికార్డు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి అదరగొట్టారు. సౌతాఫ్రికాతో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో హాఫ్ సెంచరీతో రాణించారు. ఒక సిక్స్, ఆరు ఫోర్లతో కేవలం 54 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు. దీంతో రోహిత్ శర్మ కీలక మైలురాయిని చేరుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ (టెస్టు, వన్డే, T20)లో 20,000 పరుగులు చేసిన నాలుగో ఇండియన్ ప్లేయర్ నిలిచారు. కేశవ్ వేసిన 14 ఓవర్ నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ ఘనత సాధించారు. సచిన్(34,357), కోహ్లీ(27,910), ద్రవి డ్ (24,064) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. కాగా ప్రస్తుత మ్యాచ్ భారత్ నిలకడగా ఆడుతోంది. క్రీజులో జైస్వాల్(37), రోహిత్(50) ఉన్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. టాస్ గెలిచిన టీమ్ఇండియా సఫారీలకు తొలుత బ్యాటింగ్ అప్పగించింది. సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (106) సెంచరీ బాదాడు. టెంబా బావుమా (48) రాణించాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 4, ప్రసిద్ధ్‌ కృష్ణ 4, అర్ష్‌దీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు.

Next Story