భారత్‌కు ఆడాలనుకుంటే ఆ పని చేయండి.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఆదేశం

by Harish |

భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే.

భారత్‌కు ఆడాలనుకుంటే ఆ పని చేయండి.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఆదేశం
X

దిశ, స్పోర్ట్స్ : భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. వారిద్దరికి తాజాగా బీసీసీఐ కీలక ఆదేశాలు పంపించింది. భవిష్యత్తులో వన్డేల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలనుకుంటే దేశవాళీలో ఆడాల్సిందేనని స్పష్టం చేసింది. త్వరలో జరగబోయే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడాలని వారిని ఆదేశించింది. ‘భారత్ తరపున ఆడాలనుకుంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బోర్డు, టీమ్ మేనేజ్‌మెంట్ వారికి తెలియజేసింది. వారిద్దరూ రెండు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు కాబట్టి మ్యాచ్ ఫిట్‌నెస్ కోసం వారు దేశవాళీ ఆడాల్సిందే.’అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

‘వారు ఫ్రీగా ఉంటే దేశవాళీ ఆడాలని స్పష్టం చేశాం.’అని చీఫ్ సెలెక్టర్ అజిత్ కూడా ఇటీవల ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో చెప్పారు. విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు రోహిత్ సిద్ధంగా ఉన్నాడట. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తెలియజేసినట్టు సమాచారం. అయితే, విరాట్ ఆడతాడా?లేదా? అన్నది ఇంకా తెలియదు. గతంలో రోహిత్, కోహ్లీలకు దేశవాళీ నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో రోహిత్ అదరగొట్టాడు. సెంచరీ, హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు, కోహ్లీ తొలి రెండు మ్యాచ్‌ల్లో డకౌటైనా ఆఖరి మ్యాచ్‌లో అర్ధ శతకం కొట్టాడు.


Next Story