కోహ్లీ, రోహిత్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడితే, ప్ర‌త్య‌ర్థుల‌కు న‌ర‌క‌మే!

by velandi.Saikiran |   (  Updated:2026-05-21 17:29:18  IST  )

కోహ్లీ, రోహిత్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడితే ప్ర‌త్య‌ర్థుల‌కు క‌ష్ట‌మే అంటూ పాంటింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

కోహ్లీ, రోహిత్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడితే, ప్ర‌త్య‌ర్థుల‌కు న‌ర‌క‌మే!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీ20లతో పాటు టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడిన తర్వాత, రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఇందులో భాగంగానే వన్డే వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఫిట్నెస్, ఆటతీరును మెరుగుపరుచుకుంటున్నారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోహిత్, కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్లు వరల్డ్ కప్ ఆడితే... ప్రత్యర్థులకు నరకమే అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఇద్దరు ఛాంపియన్ ప్లేయర్లను ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదని పేర్కొన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ లో ఆడాలని వారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.. అలాంటి ప్లేయర్లను కచ్చితంగా ఆడించాలని బీసీసీఐకి సూచనలు చేశారు. ఒకప్పటిలా ఇంటర్నేషనల్ క్రికెట్ ఎక్కువగా ఆడకపోయినప్పటికీ కోహ్లీలో ఏ మాత్రం పస తగ్గలేదని వెల్లడించారు. ఇక రోహిత్ శర్మ అయితే గతంలో లేని ఫిట్ నెస్ సంపాదించాడని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్లేయర్లను కలిగి ఉండడం భారత జట్టు అదృష్టం అన్నారు.

Next Story