రోహిత్ 10 ఏళ్ల తర్వాత.. రంజీ ట్రోఫీ ఆడబోతున్న హిట్‌మ్యాన్

by Harish |

భారత కెప్టెన్ రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు.

రోహిత్ 10 ఏళ్ల తర్వాత.. రంజీ ట్రోఫీ ఆడబోతున్న హిట్‌మ్యాన్
X

దిశ, స్పోర్ట్స్ : రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లు ఆకర్షణగా నిలువనున్నాయి. ఈ సారి స్టార్ క్రికెటర్లు రంజీ మ్యాచ్‌లు ఆడటమే అందుకు కారణం. భారత కెప్టెన్ రోహిత్ శర్మ పదేళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు. అతను చివరిసారిగా 2015లో రంజీ ట్రోఫీ ఆడాడు. ఇటీవల భారత ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ ఆడాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవల చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ముంబై తరపున రంజీ ట్రోఫీ ఆడతానని హిట్‌మ్యాన్ ధ్రువీకరించాడు. ఈ నెల 23 నుంచి ముంబై, జమ్ము అండ్ కశ్మీర్ మధ్య మ్యాచ్ మొదలుకానుంది. ఈ మ్యాచ్‌‌తో రోహిత్ దేశవాళీ క్రికెట్‌లో పునరాగమనం చేయబోతున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) సోమవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించగా.. జట్టులో రోహిత్‌కు చోటు దక్కింది. ముంబై జట్టుకు సీనియర్ బ్యాటర్ అజింక్యా రహనే కెప్టెన్. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్‌లను ఆడనున్నారు. ఆ మ్యాచ్‌లో రోహిత్, జైశ్వాల్ ఓపెనర్లుగా దిగే అవకాశాలు ఉన్నాయి. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడుతున్న రోహిత్‌‌కు రంజీ మ్యాచ్ ఆడటం ఫామ్ అందుకోవడానికి సహాయపడనుంది. అలాగే, రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో రంజీ ఆడటం ద్వారా అతను టెస్టు కెరీర్‌ను కొనసాగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.


Next Story