అదిరిపోయే లుక్ లో హిట్ మ్యాన్‌ రోహిత్ శర్మ

by velandi.Saikiran |

రోహిత్ శర్మ అదిరిపోయే లుక్ లో వైర‌ల్ గా మారింది.

అదిరిపోయే లుక్ లో హిట్ మ్యాన్‌ రోహిత్ శర్మ
X

దిశ‌, వెబ్ డెస్క్: మొన్నటి వరకు ఐపీఎల్ 2026 ఆడి బిజీగా ఉన్న రోహిత్ శర్మ, ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే న్యూ లుక్ లో దర్శనమిచ్చాడు. తాజాగా వాంఖడే స్టేడియంలో హిట్ రోహిత్ శర్మ సందడి చేశారు. అక్కడ టీ20 ముంబై లీగ్ ప్రారంభోత్సవానికి రోహిత్ శర్మ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాజువల్ షర్ట్, ప్యాంట్, సన్ గ్లాసెస్ పెట్టుకొని అదిరిపోయే లుక్ లో మెరిసారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇవి చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అచ్చం హీరోలా ఉన్నాడు రా బాబు... ఇది రోహిత్ శర్మ 2.0 వర్షం అంటున్నారు. అలాగే 2027 వన్డే వరల్డ్ కప్ లో ఇదే జోష్ తో రోహిత్ శర్మ ఆడాలని కూడా కోరుతున్నారు.

Next Story