- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాథ్యూస్ చివరి టెస్టు.. రోహిత్ ఎమోషనల్ మెసేజ్
శ్రీలంక వెటరన్ ఏంజెలో మాథ్యూస్ తన కెరీర్‌లో చివరి టెస్టు ఆడుతున్నాడు. అతనికి రోహిత్ శర్మ ఎమోషనల్ మెసేజ్‌తో వీడ్కోలు పలికాడు.

దిశ, స్పోర్ట్స్: కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న శ్రీలంక వెటరన్ ఏంజెలో మాథ్యూస్‌కు టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఎమోషనల్ మెసేజ్‌తో వీడ్కోలు పలికాడు. ‘టెస్టుల్లో అద్భుతమైన కెరీర్ సాధించినందుకు కంగ్రాట్స్. ఈ చివరి టెస్టులో నీకు, నీ టీంకు ఆల్ ది బెస్ట్. అండర్-19 రోజుల నుంచి మన మధ్య చాలా మంచి పోటీలు ఉన్నాయి. నీ దేశానికి నిజమైన సేవకుడిగా పనిచేశావు. ఆ దేశ ప్రజలంతా నువ్వు చేసిన సేవను మెచ్చుకుంటారని నమ్ముతున్నా. నీ స్థాయి సక్సెస్ సాధించడం చాలాకష్టం. నీకు, నీ కుటుంబానికి ఆల్ ది బెస్ట్. హ్యాపీ రిటైర్‌మెంట్. ఈ క్షణాన్ని ఎంజాయ్ చెయ్యి. మళ్లీ కలుద్దాం’ అని రోహిత్ వీడియో సందేశం పంపించాడు.
కాగా, మాథ్యూస్ ఆడుతున్న చివరి టెస్టులో శ్రీలంక తడబడుతోంది. బంగ్లాదేశ్ బ్యాటర్లు నజ్ముల్ హొసేన్ షాంటో (136 నాటౌట్), ముష్ఫికర్ రహీం (105 నాటౌట్) సెంచరీలతో చెలరేగడంతో ఆ జట్టు 292/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో ఈ మ్యాచులో ఓటమితో మాథ్యూస్‌కు వీడ్కోలు పలుకుతారేమో? అని ఫ్యాన్స్ బాధపడుతున్నారు.






