- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ హజారే ట్రోఫీ: రోహిత్ శర్మ డకౌట్
by Muthe.Rajitha |
విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లోసెంచరీతో మెరిసిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నేడు జరిగిన మ్యాచ్‌లో మాత్రం అభిమానులను నిరాశపరిచాడు.

X
దిశ, వెబ్ డెస్క్ : విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లోసెంచరీతో మెరిసిన టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ నేడు జరిగిన మ్యాచ్‌లో మాత్రం అభిమానులను నిరాశపరిచాడు. జైపుర్ వేదికగా శుక్రవారం ముంబయి vs ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ మొదట బౌలింగ్ ఎంచుకోగా.. ముంబయి బ్యాటింగ్‌కు దిగింది. అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ షాక్ ఇచ్చాడు. తొలి బంతికే డకౌట్ అయ్యాడు. దేవేంద్ర సింగ్ బోరా వేసిన మొదటి బంతికి జగమోహన్ నాగర్‌కోటి క్యాచ్ పట్టడంతో రోహిత్ పెవిలియన్‌కు చేరాడు. ఐదు ఓవర్ల ముగిసే సమయానికి ముంబయి ఒక వికెట్ కోల్పోయి 22 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ముషీర్ ఖాన్, రఘువంశీ ఉన్నారు.
Next Story






