ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో రోహిత్‌కు దక్కని చోటు.. భారత్ నుంచి వారికి చాన్స్

by Harish |

చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జట్టులో రోహిత్‌కు దక్కని చోటు.. భారత్ నుంచి వారికి చాన్స్
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారితో ఈ జట్టును ఎంపిక చేసినట్టు ఐసీసీ వెల్లడించింది. టైటిల్ విన్నింగ్ కెప్టెన్, భారత సారథి రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్‌ను తమ కెప్టెన్‌గా ఎంచుకుంది. అయితే, ఐసీసీ జట్టులో భారత్ నుంచి ఆరుగురికి స్థానం లభించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, పేసర్ మహ్మద్ షమీ, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ప్లేయింగ్ 11లో చోటు సంపాదించారు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌‌ను ఐసీసీ 12వ ప్లేయర్‌గా ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌ నుంచి శాంట్నర్‌తోపాటు రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్‌, మ్యాట్ హెన్రీ ఎంపికయ్యారు. అఫ్గానిస్తాన్ నుంచి ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్ ఉన్నారు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్ల నుంచి ఒక్కరూ కూడా సెలెక్ట్ అవ్వలేదు.

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జట్టు

రచిన్ రవీంద్ర, ఇబ్రహీం జద్రాన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, గ్లెన్ ఫిలిప్స్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మిచెల్ శాంట్నర్(కెప్టెన్), మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీ, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్.


Next Story