Rohit sharma: అరుదైన రికార్డు చేరువలో హిట్ మ్యాన్

by D.Reddy |
Rohit sharma: అరుదైన రికార్డు చేరువలో హిట్ మ్యాన్
X

దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం హిట్ మ్యాన్ ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడుతున్నాడు. కొంతకాలంగా నిరాశపరుస్తోన్న రోహిత్‌ ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో రెండు పరుగులకే వెనుదిరిగాడు. ఆదివారం రెండో వన్డే జ‌ర‌గ‌నుంది. అయితే, రోహిత్ మరో 50 ప‌రుగులు సాధిస్తే.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప‌రుగులు సాధించిన భార‌త ఓపెన‌ర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. ఈ క్రమంలో అత‌డు స‌చిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయ‌నున్నాడు.

కాగా, ఇప్పటివరకు రోహిత్ శర్మ 342 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 45.22 సగటుతో 15,285 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 346 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చి 48.07 స‌గ‌టుతో 15335 ప‌రుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన భారత ఓపెనర్‌గా వీరేంద్ర సెహ్వాగ్ 332 మ్యాచ్‌ల్లో 16,119 పరుగులు చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అత్యధిక రన్స్ చేసిన ఆటగాళ్లలో శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య అగ్రస్థానంలో ఉన్నాడు. 506 మ్యాచ్‌ల్లో 19,298 ప‌రుగులు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్లు వీరే..

సనత్ జయసూర్య(శ్రీలంక‌) - 506 మ్యాచ్‌ల్లో 19298 పరుగులు

క్రిస్ గేల్(వెస్టిండీస్‌) - 441 మ్యాచ్‌ల్లో 18867 పరుగులు

డేవిడ్ వార్నర్(ఆస్ట్రేలియా) - 374 మ్యాచ్‌ల్లో 18744 పరుగులు

గ్రేమ్ స్మిత్(సౌతాఫ్రికా) - 342 మ్యాచ్‌ల్లో 16950 పరుగులు

డెస్మండ్ హేన్స్(వెస్టిండీస్‌)- 354 మ్యాచ్‌ల్లో 16120 పరుగులు

వీరేంద్ర సెహ్వాగ్(భార‌త్) -332 మ్యాచ్‌ల్లో 16119 పరుగులు

సచిన్ టెండూల్కర్(భార‌త్‌) - 346 మ్యాచ్‌ల్లో 15335 పరుగులు

రోహిత్ శర్మ(భార‌త్‌) - 342 మ్యాచ్‌ల్లో 15,285 పరుగులు

Next Story

Most Viewed