- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విశాఖపట్నం చేరుకున్న భారత్, ఇంగ్లాండ్ జట్లు
విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టు కోసం భారత్, ఇంగ్లాండ్ జట్లు మంగళవారం విశాఖపట్నం చేరుకున్నాయి.

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో టీమ్ ఇండియా అనూహ్య ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో పరాజయంతో ఐదు టెస్టులో సిరీస్‌లో రోహిత్ సేన పుంజుకోవాల్సిన అవసరం ఉన్నది. విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా మంగళవారం విశాఖపట్నం చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, బుమ్రా, అక్షర్ పటేల్, శుభ్‌మన్ గిల్, రవిచంద్రన్ అశ్విన్, రజత్ పాటిదార్‌లతోపాటు మిగతా ఆటగాళ్లు విశాఖ ఎయిర్‌పోర్టులో దిగారు. కేఎల్ రాహుల, రవీంద్ర జడేజా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు, వారి స్థానాల్లో సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్ జట్టులోకి వచ్చారు. వీరు త్వరలోనే జట్టుతో కలవనున్నారు. అలాగే, ఇంగ్లాండ్ టీమ్ సైతం వైజాగ్‌కు వచ్చింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తరపున విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.






