- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరో సంచలన రికార్డు నమోదు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరో సంచలన రికార్డు నమోదు చేశారు. సిక్స్‌ల్లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది(351 సిక్స్‌లు) పేరిట ఉన్న రికార్డ్‌ను రోహిత్ శర్మ బ్రేక్ చేశారు. ఇప్పటివరకు 269 వన్డే ఇన్సింగ్స్ ఆడిన రోహిత్ శర్మ.. 352 సిక్స్‌లు బాదారు. ఆదివారం రాంచీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు. కాగా, టీ20, టెస్ట్ క్రికెట్‌కు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాలో 2027లో జరగనున్న వన్డే వరల్డ్ కప్‌లో టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. బాగా బరువు తగ్గి, స్లిమ్‌గా మారి.. ఫిట్‌నెస్‌ను సైతం మెరుగుపర్చుకున్నాడు. ఇటీవల ముగిసిన ఆసీస్ టూర్‌లో బ్యాట్‌తోనూ రాణించాడు. వయసు పెరుగుతున్నా.. తనలో ఇంకా పరుగుల దాహం తగ్గలేదని నిరూపిస్తున్నాడు. పాకిస్తాన్ ప్లేయర్ రికార్డును బ్రేక్ చేయడంతో టీమిండియా ఫ్యాన్స్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.






