- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల శాలరీలు ఎంతో తెలుసా?
టీమిండియా(Team India) స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రపంచ క్రికెట్‌లో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. అంతేకాదు.. వీరిద్దరికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ ఇద్దరితో పాటు మొత్తం ఇండియన్ క్రికెటర్స్(Indian Cricketers)కు బీసీసీఐ(BCCI) శుభవార్త చెప్పింది. భారత క్రికెట్ బోర్డు 2024-25 ఏడాదికి సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. మొత్తం A+, A, B అంటూ మూడు కేటగిరీల ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.
గ్రేడ్ A+లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలకు చోటు దక్కింది. వీరికి ఏడాదికి రూ.7 కోట్లను శాలరీ ఇవ్వనున్నారు. గ్రేడ్ Aలో మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషభ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి రూ.5 కోట్లు ఇవ్వనున్నారు. గ్రేడ్ Bలో సూర్యకుమార్ యాదవ్, కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కింది. వీరికి సంవత్సరానికి రూ.3 కోట్ల వేతనం అందుతుంది.






