'నాటు నాటు' పాటకు Rohit Sharma, KL Rahul డ్యాన్స్ (వీడియో)

by Disha Web Desk 2 |
నాటు నాటు పాటకు Rohit Sharma, KL Rahul డ్యాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా దాయాది దేశాలైన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌‌ను వీక్షించేందుకు కేవలం రెండు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాభిమానులు ఎంతో ఉత్కంఠంగా ఎదరుచూస్తున్నారు. అయితే, మరికొన్ని రోజుల్లో టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు అనూహ్య షాక్ తగిలింది. పేసర్ షహీన్ ఆఫ్రీది టోర్నీ నుంచి గాయం కారణంగా వైదొలిగాడు. దీంతో టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. గత టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాను భారీ దెబ్బ కొట్టిన షహీన్‌ టోర్నీ నుంచే వైదొలగడంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. వరల్డ్‌ కప్‌లో ఆఫ్రీది బౌలింగ్‌లో ఔటైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఓపెనర్ కేఎల్ రాహుల్‌లు ఆర్ఆర్ఆర్ సినిమాలోని 'నాటు నాటు' పాటకు డ్యాన్స్ వేస్తున్న వీడియోలు ట్విట్టర్ వేదికగా పోస్టు చేస్తున్నారు.



Next Story

Most Viewed