సచిన్ రికార్డు బద్దలు.. మరో అరుదైన ఘనత సాధించిన హిట్‌మ్యాన్

by Gantepaka Srikanth |

టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరో అరుదైన ఘనత సాధించారు.

సచిన్ రికార్డు బద్దలు.. మరో అరుదైన ఘనత సాధించిన హిట్‌మ్యాన్
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరో అరుదైన ఘనత సాధించారు. వన్డే ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పటివరకు టీమిండియా లెజెండ్ సచిన్ టెండుల్కర్(Sachin Tendulkar) పేరిట ఉన్న రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు హిట్ మ్యాన్(Hit Man). కాగా, వన్డేల్లో ఓపెనర్‌గా రోహిత్ శర్మ 43 ఇన్నింగ్స్‌లో 2236 పరుగులు చేశారు. ఆ తర్వాత సచిన్ టెండుల్కర్ 41 ఇన్సింగ్స్‌లో 2169 పరుగులు, 51 ఇన్సింగ్స్‌లో వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ క్రిస్ గేల్ 1977 పరుగులు, 52 ఇన్సింగ్స్‌లో శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య 1627 పరుగులు, 32 ఇన్సింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్(David Warner) 1594 పరుగులు చేసి తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

మరోవైపు.. ఇటీవలే భారత్‌(Bharat)కు రోహిత్ శర్మ రెండు ఐసీసీ ట్రోఫీలు(ICC Trophies) అందించారు. గతేడాది టీ20 ప్రపంచకప్-2024 అందించిన రోహిత్ శర్మ.. 9 నెలల వ్యవధిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)లో విజేతగా నిలబెట్టాడు. భారత క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు అందించలేదు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 2007 టీ20 ప్రపంచకప్‌తో పాటు 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు. దీంతో రోహిత్‌ను దేశ వ్యాప్తంగా అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Next Story