రోహన్ బోపన్న సంచలన నిర్ణయం.. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్

by Kema Shiva Kumar |

భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న (45) తన 22 ఏళ్ల విశిష్ట ప్రొఫెషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.

రోహన్ బోపన్న సంచలన నిర్ణయం.. ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత టెన్నిస్ దిగ్గజం రోహన్ బోపన్న (45) తన 22 ఏళ్ల విశిష్ట ప్రొఫెషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. నవంబర్ 1, 2025న పారిస్ మాస్టర్స్‌లో చివరి మ్యాచ్ ఆడిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ఇవాళ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. టెన్నిస్ నాకు జీవిత ఉద్దేశ్యాన్ని ఇచ్చిందని బోపన్న అన్నాడు. నా బలహీనతల్లో ధైర్యాన్ని, సందేహాల్లో విశ్వాసాన్ని నేర్పిందని పేర్కొన్నాడు. భారతదేశానికి సారథ్యం వహించడం తన జీవితంలో అత్యంత గొప్ప గౌరవమని ఎమోషనల్ అయ్యాడు. ఇన్నాళ్లు తన కెరీర్‌కు సపోర్టుగా నిలిచిన భార్య సుప్రియ, కూతురు త్రిధా, కోచ్‌లు, అభిమానులకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.

ప్రొఫెషనల్ టెన్నిస్‌లో రోహన్ బోపన్న అరుదైన ఘనతలు సాధించాడు. 2017 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ (సానియా మిర్జాతో), 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్‌లో 43 ఏళ్ల మాథ్యూ ఎబ్డెన్‌తో జతకట్టి అత్యంత వృద్ధ గ్రాండ్‌స్లామ్ విజేతగా రికార్డు. రోహన్ బోపన్న రికార్డు సృష్టించాడు. అదేవిధంగా డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిచాడు. కెరీర్‌లో మొత్తంగా 24 డబుల్స్, 6 మాస్టర్స్ 1000 టైటిల్స్ సాధించాడు. డేవిస్ కప్‌లో 2002–2023 వరకు 21 సంవత్సరాలు భారత్ తరఫున ఆడి, 2023లో చివరి మ్యాచ్ గెలిచి వీడ్కోలు తీసుకున్నాడు. 2012, 2016, 2024 ఒలింపిక్స్‌లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ తర్వాత టెన్నిస్ అకాడమీల ద్వారా యువ ప్రతిభలను పెంచేందుకు కృషి చేస్తానని బోపన్న పేర్కొన్నాడు.

Next Story