- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
45 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన బోపన్న
భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్, 45 ఏళ్ల రోహన్ బోపన్న మరో రికార్డు నెలకొల్పాడు.

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్, 45 ఏళ్ల రోహన్ బోపన్న మరో రికార్డు నెలకొల్పాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 మ్యాచ్‌లో విజయం సాధించిన అతి పెద్ద వయసు గల ఆటగాడిగా నిలిచాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న మోంటె కార్లో మాస్టర్స్ టోర్నీలో ఈ ఘనత సాధించాడు. ఆదివారం రాత్రి జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో అమెరికా పార్ట్‌నర్ బెన్ షెల్టన్‌తో కలిసి బోపన్న 6-3, 7-5 తేడాతో ఫ్రాన్సిస్కో సెరుండోలో(అర్జెంటీనా)-అలెజాండ్రో టాబిలో(చిలీ)జంటను ఓడించాడు. ఇంతకుముందు ఏటీపీ మాస్టర్స్ 1000 మ్యాచ్ నెగ్గిన ఓల్డెస్ట్ ప్లేయర్ రికార్డు కెనడా ప్లేయర్ డేనియల్ నెస్టర్ పేరిట ఉంది. అతను 2017లో మాడ్రిడ్ మాస్టర్స్‌లో 44 ఏళ్ల 8 నెలల వయసులో అతను ఈ ఫీట్ సాధించగా.. తాజాగా 45 ఏళ్ల బోపన్న ఆ రికార్డును బ్రేక్ చేశాడు. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన బోపన్న గ్రాండ్‌స్లామ్ నెగ్గిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచిన విషయం తెలిసిందే.






