టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేంలో ఫెదరర్.. ఎంపికైన ఏకైక ప్లేయర్ అతనే!

by Phanindra |

టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేంలో ఫెదరర్ చేరనున్నాడు. ప్లేయర్ కేటగిరీలో అతనొక్కడే ఎంపికైనట్లు ఐటీహెచ్ఎఫ్ వెల్లడించింది.

టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేంలో ఫెదరర్.. ఎంపికైన ఏకైక ప్లేయర్ అతనే!
X

దిశ, స్పోర్ట్స్: టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ స్విస్ దిగ్గజానికి ‘ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ (ఐటీహెచ్‌ఎఫ్) క్లాస్ 2026’లో చోటు దక్కింది. తొలిసారి ఈ పోటీలో నిలిచిన అతను ఒక్కడికే.. ఈ ఎన్నికల్లో ప్లేయర్ కేటగిరీ నామినేషన్‌కు అవసరమైన ఓట్లు దక్కినట్లు ఐటీహెచ్‌ఎఫ్ తెలిపింది. రోడ్ ఐలాండ్‌కు చెందిన ఈ ఐటీహెచ్‌ఎఫ్.. ఎప్పట్లాగే ఈ పోల్‌ వివరాలను వెల్లడించలేదు. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఫెదరర్ పేరును ‘హాల్ ఆఫ్ ఫేం’లో చేర్చనున్నారు. ఈ అరుదైన గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉందని, గొప్ప విజేతలు ఉన్న టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో తన పేరు చేరడం చాలా గొప్ప గౌరవమని ఫెదరర్ చెప్పాడు.

ఈ క్రీడ, తన సహచర ప్లేయర్ల నుంచి ఈ గౌరవం దక్కడం తనలో మరింత వినయం పెంచుతుందన్నాడు. తను టెన్నిస్ ఆడిన సమయాన్ని ‘గోల్డెన్ టైం’గా పలుమార్లు ప్రస్తావించిన ఫెదరర్.. నోవాక్ జకోవిక్, రఫేల్ నాదల్‌తో కలిసి టెన్నిస్ క్రీడను ఏలాడు. ఏ టోర్నీ అయినా పోటీ ఈ ముగ్గురి మధ్యనే అనేంత గొప్ప రైవలరీ వీరి మధ్య ఉండేది. అప్పట్లోనే 20 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించి రికార్డు సృష్టించాడు. ఎనిమిదిసార్లు వింబుల్డన్, ఆరుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్, ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి.. కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తిచేసిన 8వ టెన్నిస్ లెజెండ్‌గా చరిత్ర సృష్టించాడు.

Next Story