ఆ లేడీతో నైట్ పార్టీలు..అడ్డంగా దొరికిపోయిన టీమిండియా క్రికెటర్ !

by velandi.Saikiran |   (  Updated:2025-06-02 10:58:20  IST  )

టీమిండియా స్టార్ ఆటగాడు చాహల్ ( Yuzvendra Chahal ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో టీమిండియాలో ఒక ఊపు

ఆ లేడీతో నైట్ పార్టీలు..అడ్డంగా దొరికిపోయిన టీమిండియా క్రికెటర్ !
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ ఆటగాడు చాహల్ ( Yuzvendra Chahal ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో టీమిండియాలో ఒక ఊపు ఊపాడు. కానీ ఇప్పుడు జట్టులో అతనికి స్థానం రాకపోవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) టోర్నమెంట్లో రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే... తన భార్య ధనశ్రీ వర్మ కు ( Dhana sri verma) విడాకులు ఇచ్చాడు చాహల్.

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కంటే ముందు చాహల్ అలాగే ధనశ్రీ వర్మ కు విడాకులు మంజూరయ్యాయి. అంతకంటే ముందు నుంచి ఆర్జే మహవాష్ (Rj Mahvash) అనే అమ్మాయితో తిరుగుతున్నాడు చాహల్. వీరిద్దరూ ముంబైలో ఓ ఫ్లాట్ కూడా తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. నెలకు 3 లక్షల రూపాయల రెంట్ ( Rent) కూడా చాహల్ కడుతున్నట్లు సమాచారం. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇక ఈ బ్యూటీ ఆర్జే మహవాష్... పంజాబ్ కింగ్స్ జరిగే ప్రతి మ్యాచ్ కు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా మరోసారి ఇద్దరూ... రాత్రిపూట డిన్నర్ కి వెళ్ళినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు వెళ్లే కంటే ముందు... రాత్రిపూట అహ్మదాబాద్ లోని ఓ ప్రముఖ రెస్టారెంట్ కు వెళ్లినట్లు వీడియో బయటకు వచ్చింది. ఓ యువతి తీస్తున్న వీడియోలో ఈ ఇద్దరు మెరిసారు. దీంతో క్షణాల్లోనే చాహల్ అలాగే ఆర్జే మహవాష్ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఈ ఇద్దరు డిన్నర్ కు వెళ్లారని.. రాత్రిపూట తన ప్రియురాలితో బాగా చాహల్ ఎంజాయ్ చేస్తున్నాడని కామెంట్స్ పెడుతున్నారు.

Next Story