తల్లి పూజలు వృధా ... సెంచరీ కాకుండానే రియాన్ పరాగ్ ఔట్

by velandi.Saikiran |   (  Updated:2025-05-04 13:45:57  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుతంగా రానిస్తున్నాడు.

తల్లి పూజలు వృధా ... సెంచరీ కాకుండానే రియాన్ పరాగ్ ఔట్
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ అద్భుతంగా రానిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లో రాజస్థాన్ ఆటగాళ్లు అందరు విఫలమైన... రియాన్ పరాగ్ మాత్రం కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలోనే కేకేఆర్ బౌలర్ మొయిన్ అలీ బౌలింగ్ లో ఏకంగా ఐదు సిక్సర్లు వరుసగా కొట్టాడు. దీంతో సెంచరీకి చేరువయ్యాడు రియాన్ పరాగ్.

అయితే 45 బంతుల్లో 95 పరుగులు చేసిన రియాన్ పరాగ్.. సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. అటు ఇవాళ మ్యాచ్ కు రియాన్ పరాగ్ తల్లి కూడా వచ్చింది. తన కొడుకు ఎలాగైనా ఇవాల్టి మ్యాచ్ లో సెంచరీ చేయడమే కాకుండా... జట్టును కూడా గెలిపించాలని ఎంతో ప్రార్థించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే.. ఆ తల్లి ప్రార్థనలు ఏమాత్రం ఫలించలేదు.

95 పరుగుల వద్ద హర్షిత్ రానా బౌలింగ్ లో వికెట్ సమర్పించుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు మరోసారి కష్టాల్లో పడింది. గెలిచే మ్యాచ్ లో అతడు ఔట్ కావడంతో.. రాజస్థాన్ రాయల్స్ గెలవ డం గగనంగా మారింది. ఇక రియాన్ పరాగ్ తన 95 పరుగుల ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లతో పాటు ఆరు బౌండరీలు కొట్టాడు.


Next Story