ఇంత బలుపు ఎందుకు నీకు... పరాగ్ పై ఫాన్స్ ఫైర్ !

by velandi.Saikiran |

రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals) తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ ( Ryan Parag ) పైన దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది.

ఇంత బలుపు ఎందుకు నీకు... పరాగ్ పై ఫాన్స్ ఫైర్ !
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals) తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ ( Ryan Parag ) పైన దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. గ్రౌండ్ స్టాప్ తో మిస్ బిహేవ్ చేశాడు రియాన్ పరాగ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఆదివారం రోజున రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ( Rajasthan Royals vs Chennai Super Kings ) జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై... రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా 6 పరుగులు తేడాతో విజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్.

అయితే ఈ మ్యాచ్ విజయం తర్వాత రాజస్థాన్ ప్లేయర్లు.. గౌహతి స్టేడియంలో ( Guwahati Stadium ) సరదాగా కనిపించారు. ఈ తరుణంలోనే రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ తో సెల్ఫీలు దిగేందుకు గ్రౌండ్ స్టాఫ్ ( Ground Staffs) ఎగబడ్డారు. దీంతో వాళ్లకు సహకరించాడు రియాన్ పరాగ్ ( Ryan Parag ). అయితే.. గ్రౌండ్ స్టాప్ తో సెల్ఫీ దిగిన తర్వాత... వాళ్ల మొబైల్ ఫోన్ ను విసిరేశాడు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజెన్స్.. ఇంత బలుపు ఎందుకు రియాన్ పరాగంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే క్రికెట్ లో ఎదుగుతున్నావు..? ఇలాంటి సమయంలో ఇంత ఆటిట్యూడ్ అవసరమా? అంటూ నిలదీస్తున్నారు. కెరీర్ పైన దృష్టి పెట్టు కానీ ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు... అని మండిపడుతున్నారు.


Next Story