రితిక పసిడి పంచ్.. ఆసియా అండర్-22 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం

by Harish |

భారత మహిళా బాక్సర్ రితిక ఆసియా అండర్-22 చాంపియన్‌గా అవతరించింది.

రితిక పసిడి పంచ్.. ఆసియా అండర్-22 బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం
X

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళా బాక్సర్ రితిక ఆసియా అండర్-22 చాంపియన్‌గా అవతరించింది. బ్యాంకాంక్‌లో జరిగిన ఏసియన్ అండర్-19, అండర్-22 చాంపియన్‌‌షిప్‌లో ఆమె మహిళల 80+ కేటగిరీలో స్వర్ణ పతకం సాధించింది. సోమవారం జరిగిన ఫైనల్‌లో రితిక 4-1 తేడాతో కజకస్థాన్‌కు చెందిన అస్సెల్ టోక్టాసైన్‌ను మట్టికరిపించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం. అయితే, అండర్-22 విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచిన ఏకైక భారత బాక్సర్ రితికనే. మహిళల విభాగంలో యాత్రి(57 కేజీలు), ప్రియ(60 కేజీలు), పురుషుల విభాగంలో నీరజ్(75కేజీలు), ఇషాన్(90+కేజీలు) ఫైనల్‌లో ఓడి రజత పతకాలతో సరిపెట్టారు. మొత్తంగా ఈ టోర్నీలో భారత్ రెండు ఏజ్ గ్రూపుల్లో కలిపి 27 పతకాలు సాధించింది. అండర్-19 విభాగంలో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో మొత్తం 14 మెడల్స్‌తో భారత్ 2వ స్థానంలో నిలిచింది. ఇక, అండర్-22 విభాగంలో ఓ స్వర్ణం, నాలుగు రజతాలు, 8 కాంస్య పతకాలతో మొత్తం 13 మెడల్స్‌తో 4వ స్థానం దక్కింది.


Next Story