టీమిండియాకు బిగ్ షాక్‌..కొత్త కెప్టెన్ గా పంత్ !

by velandi.Saikiran |   (  Updated:2025-11-19 17:55:28  IST  )

దక్షిణాఫ్రికాతో ఎల్లుండి జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ నేపథ్యంభారత్ కు ఊహించని షాక్ తగిలింది. భారత కెప్టెన్ గిల్‌ రెండో

టీమిండియాకు బిగ్ షాక్‌..కొత్త కెప్టెన్ గా పంత్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో ఎల్లుండి జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ నేపథ్యంలో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. భారత కెప్టెన్ గిల్‌ రెండో టెస్టుకు కూడా దూరం కాబోతున్నాడు. మొదటి టెస్ట్ సందర్భంగా మెడనొప్పికి గురైన గిల్, మ్యాచ్ మొద‌టి ఇన్నింగ్స్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్ అయ్యాడు. ఆ దెబ్బకు భారత్ మొదటి మ్యాచ్ లోనే ఓడిపోయింది.

అయితే ప్రస్తుతం వైద్యుల సమక్షంలో కోలుకుంటున్న గిల్, రెండో టెస్ట్ కు కూడా దూరం అయ్యాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో రెండో టెస్ట్ లో భార‌త కెప్టెన్ గా రిష‌బ్ పంత్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక గిల్ జట్టుకు దూరం కానున్న‌ నేపథ్యంలో సాయి సుదర్శన్ తుది జట్టులోకి రాబోతున్నట్లు కూడా బీసీసీఐ ప్రకటించినట్లు కథనాలు వస్తున్నాయి. కాగా ఈ నెల 22వ తేదీ నుంచి గౌహతి వేదికగా రెండో టెస్టు జరగనుంది. ఇది ఇలా ఉండ‌గా, తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాపై ఏకంగా 30 ప‌రుగుల తేడాతో ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధించింది.

Next Story