- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇంగ్లాండ్ గడ్డపై మరోసారి చెలరేగాడు. తొలి టెస్టులో శతకం బాదాడు. తన ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో 134 రన్స్ చేశాడు. ఇంగ్లాండ్‌లో పంత్‌కు ఇది మూడో సెంచరీ. ఇంతకుముందు 2018, 2021లో 100 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. తాజా సెంచరీతో పంత్ దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. పంత్‌కు ఇది 7వ టెస్టు సెంచరీ. టెస్టుల్లో అత్యధిక శతకాలు నమోదు చేసిన భారత వికెట్ కీపర్‌గా రికార్డుకెక్కాడు. ఇంతకుముందు ఆరు సెంచరీలతో ధోనీతో కలిసి సంయుక్తంగా ఈ రికార్డును కలిగి ఉన్నాడు. తాజాగా ధోనీని వెనక్కినెట్టాడు. మొత్తంగా అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్ల జాబితాలో పంత్ 8వ స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 17 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తొలి రోజు కూడా ధోనీ పేరిట ఉన్న ఓ రికార్డును పంత్ బద్దలుకొట్టాడు. సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత వికెట్ కీపర్‌గా పంత్ ఘనత సాధించాడు. ఇంతకుముందు ధోనీ పేరిట ఈ రికార్డు ఉండేది. సేనా దేశాల్లో ధోనీ 1,731 రన్స్ చేయగా పంత్ 1,865 పరుగులు చేశాడు. అలాగే, సేనా దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా ప్లేయర్ కూడా పంతే కావడం విశేషం.






