- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rishab Pant : అంతర్జాతీయ అవార్డుకు రిషబ్ పంత్ నామినేట్
టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishab Pant) ఓ అరుదైన గౌరవం పొందనున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishab Pant) ఓ అరుదైన గౌరవం పొందనున్నారు. ఓ ప్రముఖ అంతర్జాతీయ అవార్డుకు పంత్ నామినేట్ అయ్యాడు. ప్రతిష్టాత్మక లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2025(Laureus World Sports Awards 2025)లో "కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్"(Come Back Of The Year) పురస్కారానికి రిషబ్ పంత్ నామినేట్ అయ్యాడు. ఏప్రిల్ 21న స్పెయిన్(Spain) రాజధాని మాడ్రిడ్ లో ఈ అవార్డుల కార్యక్రమం జరగనుంది. అయితే 2022, డిసెంబర్ 30న కార్ యాక్సిడెంట్ లో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. 14 నెలల సుధీర్ఘ విరామం అనంతరం 2024 ఐపీఎల్ సీజన్లో తిరిగి గ్రౌండ్స్ లోకి అడుగు పెట్టాడు. ప్రస్తుతం పంత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా తరపున ఆడుతున్నాడు. ఇక 2025 ఐపీఎల్(IPL 2025) సీజన్లో లఖన్ వూ సూపర్ జయింట్స్(LSG) కు కెప్టెన్ గా ఉన్నాడు పంత్. అయితే భారత క్రికెట్లో ఈ అవార్డుకు ఇంతకముందు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ఒక్కరే ఈ అవార్డుకు నామినేట్ కాగా, ఇపుడు రిషబ్ పంత్ నామినేట్ కావడం విశేషం.






