- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
INDvsENG: సిక్స్ కొట్టి సెంచరీ చేసిన రిషబ్ పంత్
లీడ్స్ మైదానం(Leeds Ground) వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: లీడ్స్ మైదానం(Leeds Ground) వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అదరగొడుతున్నారు. ఇప్పటికే ఓపెనర్ యశస్వి జైస్వాల్(101), కెప్టెన్ శుభ్‌మన్ గిల్(144 నాటౌట్) సెంచరీలు చేయగా.. తాజాగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా సెంచరీ చేశారు. 99 వద్ద ఏకంగా సిక్స్ బాది సెంచరీ(113 నాటౌట్) కొట్టారు. ఒకే ఇన్సింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీ చేయడం విశేషం. అంతకుముందు కేఎల్ రాహుల్(42) కూడా పర్వాలేదు అనిపించారు. ప్రస్తుతం 100 ఓవర్లు ఆడిన టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి.. 426 పరుగులు చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ స్కోరు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ ఒక వికెట్ తీయగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీశాడు.
Next Story






