రోడ్డు ప్రమాదంలో తనను కాపాడిన యువకులకు బైక్ లు గిఫ్ట్‌గా ఇచ్చిన రిషబ్ పంత్..!

by Malleboina Mahesh |

భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishabh Pant) 2022 డిసెంబర్ నెలలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

రోడ్డు ప్రమాదంలో తనను కాపాడిన యువకులకు బైక్ లు గిఫ్ట్‌గా ఇచ్చిన రిషబ్ పంత్..!
X

దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్(Rishabh Pant) 2022 డిసెంబర్ నెలలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో పంత్ తలతో పాటు శరీరానికి తీవ్ర గాయాలు కాగా అటుగా వచ్చిన ఇద్దరు యువకులు.. అతన్ని కారు నుంచి బయటకు తీసి.. ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడారు. పంత్ గాయాల నుంచి కోలుకున్న తర్వాత తనను కాపాడిన వారిని సన్మానించడమే కాకుండా.. తనక పునర్ జన్మను ఇచ్చారని వారి వల్లే తాను ప్రాణాలతో ఉన్నానని చెప్పుకొచ్చారు. పంత్ ను కాపాడిన ఇద్దరు యువకులు అయిన రజత్, నిషు ల గురించి ఓ విదేశీ మీడియా స్పెషల్ స్టోరీ(Special story)ని చేసింది. ఇందులో భాగంగా ఆ మీడియాతో వారు మాట్లాడుతూ.. కారు ప్రమాదంలో ఉన్న వ్యక్తిని తాము కాపాడామని.. ఆ సమయంలో కారులో ఉన్నది భారత క్రికెటర్ పంత్ అని తమకు తెలియదని చెప్పుకొచ్చారు. కాగా పంత్ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా.. తమ ఇద్దరికీ బైక్ లు గిఫ్ట్ గా ఇచ్చినట్లు రజత్, నిషులు ఆ స్పెషల్ స్టోరీలో చెప్పుకొచ్చారు.

Next Story