గిల్, పంత్ బ్యాటింగ్ స్థానాలపై క్లారిటీ

by Harish |

ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతుంది.

గిల్, పంత్ బ్యాటింగ్ స్థానాలపై క్లారిటీ
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతుంది. శుక్రవారం నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుండగా.. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌పై వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అప్‌డేట్ ఇచ్చాడు. బుధవారం పంత్ మీడియాతో మాట్లాడుతూ.. గిల్ 4వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని తెలిపాడు. తాను ఎప్పటిలాగే 5వ స్థానంలో దిగుతానని చెప్పాడు. కానీ, 3వ స్థానంపై ఇంకా క్లారిటీ లేదన్నాడు. ‘4,5స్థానాలు ఫిక్స్ అయ్యాయి. శుభ్‌మన్ 4వ స్థానంలో వస్తాడనుకుంటున్నా. నేను 5వ స్థానంలో వస్తా. 3వ స్థానంలో ఎవరు బ్యాటింగ్‌కు వస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే, మిగతా స్థానాలపై కూడా చర్చ జరుగుతుంది.’అని తెలిపాడు. ఈ సందర్భంగా గిల్‌తో అనుబంధం గురించి మాట్లాడుతూ..‘మేమిద్దరం మైదానం బయటకు మంచి మిత్రులు. ఫీల్డ్ వెలుపల మంచి స్నేహితులు అయితేనే మైదానంలో కూడా మంచి మిత్రులమవుతాం. అదే నేను నమ్ముతా. మేము బాగా మాట్లాడుకుంటూనే ఉంటాం. మా మధ్య మంచి కంఫర్ట్ జోన్ ఉంది.’ అని చెప్పాడు. ఇంగ్లాండ్‌ను తాము తేలికగా తీసుకోవట్లేదని పంత్ తెలిపాడు. ‘మనది కూడా యువ జట్టే. కాబట్టి, మేము ఎవరినీ లైట్‌గా తీసుకోం. అలాగే, మా స్టైల్ క్రికెట్ ఆడతాం.’ అని పంత్ చెప్పుకొచ్చాడు.


Next Story