ఐసీసీ ర్యాంకింగ్స్..రికార్డు సృష్టించిన పంత్..ఏకంగా 800 పాయింట్స్

by velandi.Saikiran |

లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్,

ఐసీసీ ర్యాంకింగ్స్..రికార్డు సృష్టించిన పంత్..ఏకంగా 800 పాయింట్స్
X

దిశ, వెబ్ డెస్క్: లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓడిపోయినప్పటికీ.. రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ గిల్ మెరుగైన టెస్ట్ ర్యాంకింగ్స్ సంపాదించారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ప్రకారం... వికెట్ కీపర్ రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఏడవ స్థానానికి ఎగబాగాడు రిషబ్ పంత్. అంతేకాదు ఏడవ స్థానానికి రావడానికి ఎనిమిది వందల పాయింట్లు సంపాదించాడు.

ప్రస్తుతం రిషబ్ పంత్ ఖాతాలో 801 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సరికొత్త రికార్డు సృష్టించాడు పంత్. ఒక వికెట్ కీపర్ ఎనిమిది వందల పాయింట్లు... సాధించి ఏడవ స్థానానికి రావడం ఇదే మొదటిసారి. ఆ రికార్డును రిషబ్ పంత్ సొంతం చేసుకున్నాడు. ఇక అటు యశస్వి జైస్వాల్ 851 పాయింట్లు నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు.

శుభమన్ గిల్ 660 పాయింట్లు తో ఐదు స్థానాలు ఎగబాకి 20వ స్థానంలో నిలిచాడు. కె ఎల్ రాహుల్ 10 స్థానాలు వేగబాకి 38వ స్థానంలో నిలిచాడు. ఇది ఇలా ఉండగా... టెస్ట్ ర్యాంకింగ్స్ లో రూట్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. అతని తర్వాత మరో ఇంగ్లాండ్ ఆటగాడు బ్రూక్ రెండో స్థానంలో ఉన్నాడు. కేన్ మామ మూడో స్థానంలో నిలిచాడు.

Next Story