టీమిండియాకు దరిద్రం...అతని సెంచరీ వల్లే దారుణ ఓటమి !

by velandi.Saikiran |

ఇంగ్లాండ్ గడ్డపై (England) టీమిండియా ( Team India) దారుణ ఓటమి చవిచూసింది. లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో

టీమిండియాకు దరిద్రం...అతని సెంచరీ వల్లే దారుణ ఓటమి !
X

దిశ, వెబ్ డెస్క్ : ఇంగ్లాండ్ గడ్డపై (England) టీమిండియా ( Team India) దారుణ ఓటమి చవిచూసింది. లీడ్స్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్టు తలపడగా... గిల్ సేన అత్యంత దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో.... టీమిండియా పై గ్రాండ్ విక్టరీ కొట్టింది ఇంగ్లీష్ టీం. చివరి రోజున... కేవలం 5 వికెట్లు నష్టపోయి.. లక్ష్యాన్ని చేదించింది ఇంగ్లాండ్. అయితే చివరి రోజున ఇంగ్లాండ్ వికెట్లను తీయడంలో.. టీమిండియా బౌలర్లు చాలా కష్టపడాల్సి వచ్చింది.

మొదటి ఇన్నింగ్స్ లో మెరిసిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం.. మ్యాజిక్ చేయలేదు. దీంతో టీమ్ ఇండియా ఓడి పోవాల్సి వచ్చింది. అయితే టీమిండియా ఓడిపోవడానికి కారణం యంగ్ క్రికెటర్ రిషబ్ పంత్ సెంచరీ చేయడమేనని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. అతను సెంచరీ చేయడం వల్ల... దరిద్రం చుట్టుకుందని అంటున్నారు. ఇప్పటి వరకు రిషబ్ పంత్ (Rishabh Pant) సెంచరీలు... చేసినా ప్రతి మ్యాచ్ టీమ్ ఇండియా ఓడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. 2018లో ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా 114 పరుగులు చేసి రాణించాడు పంత్.

ఆ మ్యాచ్ లో కూడా టీమిండియా ఓడిపోయింది. అలాగే ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 2019లో మ్యాచ్ జరగగా, ఆ మ్యాచ్ లో రిషబ్ పంత్ 159 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్ డ్రా అయింది. అలాగే సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 2022లో మ్యాచ్ జరిగింది. అప్పుడు 100 పరుగులతో దుమ్ము లేపాడు. అయినప్పటికీ టీం ఇండియా ఓడిపోయింది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 2022లో మరోసారి టెస్టులు జరగగా.. అప్పుడు 146 పరుగులు చేసిన పంత్... జట్టును గెలిపించలేకపోయాడు. ఇక తాజా మ్యాచ్ లో రెండు సెంచరీలు చేసినా కూడా టీమిండియా ఓడిపోయింది. దీంతో రిషబ్ పంత్ సెంచరీ చేస్తే టీమిండియా ఓడిపోతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో కూడా.. పంత్ సెంచరీ చేస్తే లక్నో ఓడిపోయింది.


Next Story