- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంత్‌పై ఐసీసీ యాక్షన్? అనవసరమైన పనితో చర్యలు ఎదుర్కొంటాడా?
పంత్‌పై ఐసీసీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అనవసరమైన పనితో చర్యలు ఎదుర్కొంటాడని మాజీలు అంటున్నారు.

దిశ, స్పోర్ట్స్: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌పై ఐసీసీ సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. తొలి ఇన్నింగ్సులో ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా అంపైర్‌తో పంత్ గొడవ పడటమే దీనికి కారణం. సిరాజ్ బౌలింగ్‌లో బ్రూక్ బౌండరీ బాదిన తర్వాత.. బంతి సరిగా లేదంటూ అంపైర్ వద్దకెళ్లాడు పంత్. తన వద్ద ఉన్న బాల్ గాజ్‌తో చెక్ చేసిన అంపైర్ పాల్ రీఫెల్.. బంతి ఆటకు పనికొస్తుందని, దాన్ని మార్చడం కుదరదని తేల్చిచెప్పాడు.
దీంతో చిరాకుపడ్డ పంత్.. బంతిని అంపైర్ పక్కనే విసిరేశాడు. అంపైర్‌తో గొడవ పడటంతోపాటు బంతిని దురుసుగా విసిరినందుకు ఆర్టికల్ 2.9 ప్రకారం కూడా పంత్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పంత్ ఇలా అంపైర్‌తో గొడవ పడటం అసలు అనవసరమని, బంతి గాజ్ నుంచి వెళ్లిన తర్వాత దాన్ని విసరడం అనేది ఆలోచన లేని పని అని పలువురు మాజీలు అంటున్నారు. ఏదేమైనా పంత్‌పై ఐసీసీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో తెలియాలంటే మ్యాచ్ పూర్తయ్యే వరకూ ఆగాల్సిందే.






