- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IND VS ENG: ధోని రికార్డు బ్రేక్ చేసిన రిషబ్ పంత్
ఇండియా ( TEam India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య నిన్నటి నుంచి టెస్ట్ సిరీస్ ( Test Series) కొనసాగుతోంది. నిన్న మధ

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా ( TEam India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య నిన్నటి నుంచి టెస్ట్ సిరీస్ ( Test Series) కొనసాగుతోంది. నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేస్తున్న టీమ్ ఇండియా భారీ స్కోర్ దిశగా వెళ్తోంది. ఇప్పటికే 400 పరుగులు దాటేసింది టీమిండియా.
అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ( Rishabh Pant) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సేన కంట్రీలలో ( SENA).. అత్యధిక పరుగులు చేసిన మొట్ట మొదటి టీం ఇండియా వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు రిషబ్ పంత్. టీమిండియా ప్లేయర్ గానే కాకుండా... అత్యధిక పరుగులు చేసిన ఏషియన్ ప్లేయర్ గా కూడా రికార్డ్ సాధించాడు.
ఇప్పటి వరకు సేన కంట్రీలలో ఏషియన్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ 1734 పరుగులు చేశాడు. అంతకు ముందు మహేంద్రసింగ్ ధోని ( Mahendra Singh Dhoni ) 1731 పరుగులు మాత్రమే సాధించాడు. ఇంగ్లాండ్ పై జరుగుతున్న మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తున్న రిషబ్ పంత్... ఈ సరికొత్త రికార్డు సృష్టించాడు. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ అలాగే ఆస్ట్రేలియా అన్ని దేశాలు కలిపితేనే సేన కంట్రీలు అంటారు. అలాంటి సేన కంట్రీలలో రిషబ్ పంత్ తాజాగా రికార్డు సృష్టించాడు.
Twitter Link
Rishabh Pant takes the crown! 🤍
— Sportskeeda (@Sportskeeda) June 21, 2025
With 1732 runs, he now holds the record for the most Test runs in SENA countries by an Asian wicketkeeper — surpassing MS Dhoni! 🔥#ENGvIND #RishabhPant #MSDhoni #Sportskeeda pic.twitter.com/cz5mgZLaHQ






